
బీఆర్ఎస్ ఖానాపూర్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే రేఖానాయక్ రేపు (శుక్రవారం) రాజీనామా చేయనున్నారు. గత రెండు టర్మ్‌లుగా బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆమె ఆ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఖానాపూర్ టికెట్‌ను జాన్సన్ నాయక్‌కు కేటాయించిన సంగతి తెలిసిందే. జాన్సన్ ఎన్నారై. కేటీఆర్ స్నేహితుడు కూడా. దాంతో రేఖా నాయక్‌ను కాదని సీఎం కేసీఆర్ జాన్సన్ పేరు అనౌన్స్ చేశారు. దీంతో ఆమె తీవ్ర మనస్థాపానికి లోనయ్యారు. కాంగ్రెస్‌లో చేరాలని తొలుత నిర్ణయించుకొని ఆ పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేశారు. అయితే జాన్సన్ నాయక్ ఎస్టీ కాదనీ, ఆయన క్రిస్టియన్ అనీ, టికెట్ తనకే దక్కుతుందని ఆమె కొంత ధీమాతో ఉన్నారు. ఈ క్రమంలోనే తాను కాంగ్రెస్ టికెట్ కోసం అప్లై చేయలేదని చెప్పారు. రేఖా నాయక్ భర్త శ్యామ్ నాయక్ కూడా బీఆర్ఎస్లో టికెట్ దొరకదని గ్రహించి కాంగ్రెస్ నుంచి ఆసిఫాబాద్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. లేదా లోకసభ స్థానానికైనా హమీ అడుగుతున్నారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం నుంచి పూర్తి స్థాయిలో గ్రీన్ సిగ్నల్ రాలేదు. ప్రస్తుతానికి రేఖా నాయక్ తన భవిష్యత్ ప్లాన్ ప్రకటించకపోయినప్పటికీ ఫైనల్‌గా బీఆర్ఎస్ను వీడాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.