
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ముందు ఆశా వర్కర్ల సమ్మె ఉద్రిక్తంగా మారింది. గురువారం 11 రోజుకు చేరిన సమ్మెలో భాగంగా కలెక్టరేట్ మేన్ గేట్ ను మూసేసి లోపలకు అధికారులు వెళ్లకుండా ఆశా వర్కర్ లు, సీఐటీయూ నాయకులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వీరిని చెదర గొట్టెందుకు చర్యలు చేపట్టారు. సీఐటీయు జిల్లా అధ్యక్షుడు ముంజం శ్రీనివాస్ ను మరి కొందరిని పోలీసు వాహనం లో ఎక్కించారు.దీంతో ఆశా వర్కర్ లు పోలీసులను ఎదురు తిరిగారు. తనకోసం పోరాటం చేస్తున్న నాయకులను అరెస్ట్ చేస్తే ఎలా అని అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. చివరకు పోలీసులు సీఐ టీ యూ నాయకులను పొలీస్ వాహనం లో ఎక్కించి స్టేషన్ కు తరలించారు . చేతగాని ప్రభుత్వం తమ సమస్యలు, డిమాండ్ లు పరిష్కరించకుండా పోలీసులతో అనగదొక్కూతోందని ఆవేదన వ్యక్తంచేశారు.చివరికి డిఎంహెచ్ ఓ తుకారం ఆందోనకారుల వద్దకు వచ్చి వినతిపత్రం తీసుకోవడం ఆందోళన విరమించారు.