
హాస్టల్ లో తోటి స్టూడెంట్స్ 1100 డబ్బులు తీశావని నిందమోపి చితక బాదారు. దీంతో దొంగతనం చేసిన ఫీలింగ్ ను ఓర్చుకొలేని స్టూడెంట్ గిల్టీ గా ఫీల్ అయ్యాడు. తాను ఉన్న హాస్టల్ నుంచి బయటకు వచ్చి సొంతూరు వెళ్లి అక్కడ ఇంట్లో పురుగుల మందు తాగి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. కుటుంబీకులు హాస్పిటల్ కు తరలించగా ట్రీట్మెంట్ పొందుతూ గురువారం మృతి చెందాడు.
మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం జోగాపుర్ కు చెందిన భీమయ్య, పోషక్క ల రెండో కుమారుడు కామెర ప్రభాస్ (19) మంచిర్యాల జిల్లా కేంద్రం లోని సీవి రామన్ కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఆయన మందమర్రి లోని ఎస్సీ బాయ్స్ హాస్టల్ లో ఉంటున్నాడు. బుధవారం ఉదయం హాస్టల్ లో 11 వందల రూపాయలు దొంగతనం జరిగిందని తోటి స్టూడెంట్స్ సుమంత్ ను కొట్టారు. దీంతో మనస్తాపం చెందిన సుమంత్ మధ్యాహ్నం సొంతూరు కు చేరుకొని ఇంట్లో పురుగుల మందు తాగదు. కుటుంబీకులు హాస్పిటల్ కు తరలించగా మంచిర్యాల జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు.