
ఉద్యోగార్ధులకు బ్యాడ్ న్యూస్. గ్రూప్–2 మరోసారి వాయిదా పడింది. అసెంబ్లీ ఎలక్షన్ల ఎఫెక్ట్‌తో పరీక్ష వాయిదా వేయాలని టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. నవంబర్ 2, 3 తేదీల్లో పరీక్ష జరగాల్సి ఉంది. కానీ ఎలక్షన్ల కోసం అధికారులు, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది బిజీగా ఉండడంతో ఎగ్జామ్ కోసం అదనంగా సిబ్బందిని కేటాయించే పరిస్థితి లేదు. ఒకవైపు ఎన్నికలు, మరోవైపు పరీక్ష కోసం ఏర్పాట్లు చేసే పరిస్థితి లేదని కలెక్టర్లు ప్రభుత్వానికి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఫీడ్ బ్యాడ్ నేపథ్యంలో గ్రూప్–2ను వాయిదా వేయాలని టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు ముగిసిన తర్వాత పరీక్ష నిర్వహించాలనుకుంటోంది. జనవరి 6, 7 వ తేదీలలో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది.