
సీఎల్పీ మాజీ నేత జానారెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పజెప్పింది. ట్రబుల్ షూటర్ గా జానాను కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దింపింది. సీట్ల సర్దుబాటు, నేతల మధ్య సయోధ్య కోసం జానారెడ్డి అద్వర్యంలో ఫోర్ మెన్ కమిటీని నియమించింది. ఈ కమిటీని జానా రెడ్డి లీడ్ చేస్తారు.
జానారెడ్డితో పాటు మాణిక్ రావు థాక్రే, దీపాదాస్ మున్షీ, మీనాక్షి నటరాజన్ లు కమిటీలో వున్నారు. టికెట్ల ప్రకటన తరువాత అసంతృప్తులను బుజ్జగించే బాధ్యత ఈ కమిటీ చేపడుతుంది. ఈ రోజు కమిటీ తొలి సమావేశం వుంది.