
పెళ్లిళ్ల కారణంగా రాజస్థాన్ ఎన్నికలు రెండు రోజులు పోస్ట్ పోన్ చేశారు. సోమవారం ప్రకటించిన షెడ్యూల్‌ను మార్చాలని రాష్ట్రం నుంచి విజ్ఞప్తి రావడంతో ఈసీ పునరాలోచన చేసింది. 23వ తేదీ బదులు 25వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
23వ తేదీ రాష్ట్రంలో పెళ్లిల్ళు ఉన్నాయని, ఈ కారణంగా సుమారు 25 లక్షల మంది పోలింగ్‌కు దూరం అయ్యే అవకాశాలు ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ముఖ్యాధికారి ఈసికి నివేదించింది.
ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, రాష్ట్ర సిఈఓ ఇచ్చిన నివేదికను కేంద్ర ఎన్నికల సంఘం
పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు ఎన్నికల తేదీలో మార్పులు చేస్తూ ఈసి అధికారిక ప్రకటన విడుదల చేసింది.