
హెచ్ఎండీఏ నిర్వహించిన ప్రభుత్వ భూముల వేలం ఆకాశాన్నంటింది. దేశంలోనే రికార్డు స్థాయి ధర పలికింది. కోకాపేటలో వేలం వేసిన భూములు ఎకరా 100 కోట్లు పలికింది. హెచ్ఎండీఏ కనీస ధరను 35 కోట్ల రూపాయలుగా నిర్ణయించింది. దాన్ని అధికారుల అంచనాకు మించి ధర పలికింది. అదే ప్రాంతంలో గత ఏడాది ఎకరా 60.20 కోట్ల రూపాయలకు దక్కించుకున్న రాజపుష్ఫ రియాలిటీ సంస్థే ఈ సారి రికార్డు స్థాయి ధర చెల్లించింది. కోకాపేటలోని నియోపోలిస్ లేఔట్ ఫేజ్–2 ప్లాట్ల వేలాన్ని గురువారం అమీర్‌పేటలోని స్వర్ణ జయంతి కాంప్లెక్స్‌లో నిర్వహఙంచారు. 45.33 ఎకరాలను ఏడు ప్లాట్లుగా విభజించి ఆన్లైన్లో వేలం వేయగా హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. ఇందులో కనీస ధర 60 కోట్లు పలికింది. మెజారిటీ భూములు 70 కోట్లకు అమ్ముడు పోయాయి. 3.60 ఎకరాల ప్లాట్ 10 మాత్రం 100 కోట్లకు అమ్ముడు పోయింది. ప్రభుత్వం మొత్తం 45.33 ఎకరాలను వేలం వేయగా 3,319.60 కోట్ల ఆమ్దానీ వచ్చింది. వాస్తవానికి ప్రభుత్వం 1,586.55 కోట్లు వస్తాయని అంచనా వేసింది. కానీ అది తలకిందులై డబుల్ ఆమ్దానీ వచ్చింది.