
ఆన్లైన్ బెట్టింగుల్లో సుమారు 15 లక్షలు పోగొట్టుకొని యువకుడు చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పోడ్చన్‌పల్లి తండాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పొడ్చన్‌పల్లి తండాకు చెందిన మోహన్, బుజ్జిలకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు మురళి (20) ఢిల్లీలో అగ్రికల్చర్ బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఇటీవల పోడ్చన్‌పల్లి తండాకు వచ్చాడు. ఆన్లైన్ బెట్టింగులకు అలవాటు పడి సుమారు 15 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. దీంతో బుధవారం రాత్రి గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
మరో ఘటన
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్ లో లంక రమేష్ అనే బీటెక్ విద్యార్థి ఈ నెల 1న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందాడు. పబ్జి గేమ్‌కు అడిక్ట్ అయి తల్లిదండ్రులు మందలించడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు.