టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీట్ ది ప్రెస్..
చరిత్ర చెప్పాలంటే క్రీస్తు పూర్వం.. క్రీస్తు శకం అని చెబుతాం
అలగే మన రాష్ట్రం గురించి చెప్పాలంటే తెలంగాణ వచ్చాక, తెలంగాణ రాకముందు అని చెప్పుకోవాలి
తెలంగాణ ప్రజలు కోరుకుంది స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి
రాష్ట్రం ఒక వ్యక్తి ఉక్కు పాదాల కింద నలిగిపోతోంది.అందుకే రాష్ట్ర ప్రజల కోసం నా వంతుగా నేను పోరాడుతున్నా
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు..
రాజకీయంగా నష్టపోతామని తెలిసినా.. ధర్మం వైపు నిలబడాలని రాష్ట్రం ఇచ్చారు.
లెక్కలు వేసుకుని, స్వార్ధం చూసుకుంటే వంద మంది కేసీఆర్ లు వచ్చినా తెలంగాణ ఏర్పడేది కాదు..
శ్రీకాంతాచారి లాంటి అమరుల త్యాగాలను గుర్తించి సోనియా తెలంగాణ ఇచ్చారు.
దశాబ్దం గడిచినా నీళ్లు, నిధులు నియామకాలు సాధించుకున్నమా? ఒకసారి ఆలోచన చేయాలి
టీఆరెస్ ను పోలి ఉండేలా ఉండేందుకే వాహనాలకు టీజీ బదులు టీఎస్ అని పెట్టారు
రాష్ట్ర అధికారిక ముద్ర రాజరిక పోకడను తలపిస్తోంది..
త్యాగాలను గుర్తు చేసేలా ఉండాల్సిన చిహ్నం రాచరికాన్ని తలపిస్తోంది..
తెలంగాణ ప్రతీ తల్లి ప్రతీకలా తెలంగాణ తల్లి ఉండాలి..
కానీ శ్రీమంతులు తెలంగాణ తల్లిని మనకు కేసీఆర్ చూపిస్తుండు.
త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో రచరికపోకడ కొనసాగుతోంది.
తెలంగాణలో ప్రజాస్వామ్యం లోపించింది.
ప్రజల హక్కులను కేసీఆర్ కాలరాశారు
రాష్ట్రంలో అందరినీ వర్గ శత్రువులా కేసీఆర్ చూస్తున్నారు.
ఎన్నుకున్న ప్రభుత్వానికి ప్రజలు తమ బాధలు చెప్పుకోలేని పరిస్థితి
గతంలో పాలకులు ప్రజలకు సచివాలయంలో అందుబాటులో ఉండేవారు
కానీ ఇవాళ ప్రతిపక్ష నేతలకు, జర్నలిస్టులకు సచివాలయంలోకి ప్రవేశం లేదు.
కేసీఆర్ నియంత ముసుగులో ఉన్న క్రిమినల్ పొలిటీషియన్
మార్పు జరగకుండానే ఉద్యమకారుల జీవితాలు తారుమారయ్యాయి
ఆత్మహత్య చేసుకున్న యువతులపై ప్రభుత్వమే తప్పుడు ప్రకటనలు చేస్తున్న పరిస్థితి.
కేసీఆర్ పాపాల పుట్ట పగిలింది.. మేడిగడ్డ కుంగింది.
కేసీఆర్ ఇచ్చిన ఏ హామీనీ ఈ పదేళ్లలో నెరవేర్చలేదు
ప్రజలని మోసం చేసిన కేసీఆర్ లాంటి మోసగాళ్లకు తెలంగాణలో స్థానం లేదు
పదేళ్లలో ఎవరి భవిష్యత్ బాగుపడింది.. ఎక్కడ బంగారు తెలంగాణ?
కర్ణాటకలో కాంగ్రెస్ గెలవద్దని ప్రచారం చేశారు.. అంటే పరోక్షంగా కేసీఆర్ కోరుకుంది మోదీ గెలుపేనా?
2050 వరకు రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళుతున్నాం
కేసీఆర్ గురించి తెలంగాణలోని కేసీఆర్ బాధితులే చెబుతారు… జర్నలిస్టులు కూడా కేసీఆర్ బాధితులే
తెలంగాణలో బీఆర్ఎస్ తో సహా ఇతర పార్టీలను కోరుతున్నా…
విధివిధానాలపై ఈ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళదాం
చుక్క మందు, డబ్బు లేకుండా ఎన్నికల్లోకి వెళదాం
పిల్లర్లు కుంగాయి కాబట్టే మేడిగడ్డ బ్యారేజీ జాయింట్ లో గ్యాప్ పెరిగింది
ఒక మీటరు కుంగింది అని అధికారులే చెబుతున్నారు
తప్పించుకోవడానికే కేటీఆర్ ఏవేవో మాట్లాడుతున్నారు
మేం తప్పు చెబుతున్నామంటే.. అఖిలపక్షాన్ని తీసుకెళదాం…
ప్రాజెక్టు కుంగిందో లేదో వాళ్లే చెబుతారు
బీఆరెస్ నేతలవి లాజిక్ లేని వాదనలు
సంక్షేమాన్ని తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ
పెన్షన్లు, పక్కా ఇళ్లు లాంటి పథకాలు తీసుకొచ్చింది కాంగ్రెస్
కేసీఆర్ తాను చేసింది చెప్పుకోలేక కాంగ్రెస్ నపై ఆరోపణలు చేస్తున్నారు
కేసీఆర్ వాదనల్లో డొల్లతనం స్పష్టంగా కనిపిస్తోంది
కాంగ్రెస్ ఎప్పుడూ మైనారిటీలను కేవలం ఓటు బ్యాంకుగా చూడలేదు
మైనారిటీలను అన్ని రకాలుగా సంక్షేమంలో భాగస్వాములను చేస్తాం
పేదలకు విద్యను చేరువ చేసింది కాంగ్రెస్ పార్టీ
కాంగ్రెస్ ఏర్పాటు చేసిన స్కూళ్లలో 6,540 సింగిల్ టీచర్ స్కూళ్లను కేసీఆర్ హయాంలో మూసేశారు.
రైతులకు ఎకరానికి ఏటా 10వేలు ఇస్తామని 2014లోనే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది
దాన్నే కాపీ కొట్టి కేసీఆర్ రైతు బంధు పేరుతో ఇస్తున్నారు
తన లోపాలను కప్పిపుచ్చుకునేందుకే పక్క రాష్ట్రాల అంశాన్ని తెరపైకి తెస్తున్నారు
కాంగ్రెస్ దశాబ్ద పాలన-బీఆరెస్ దశాబ్ద పాలనపై చర్చకు సిద్ధం..
మా పార్టీ నుంచి నేను, సీఎల్పీ భట్టి వస్తాం… మిగతా. పార్టీల నుంచి ఇద్దరు చొప్పున రండి..
చర్చ పెడితే పాలకు పాలు,నీళ్లకు నీళ్లు బయట పడతాయి
ఓటుకు వెల కట్టే సంస్కృతి తెచ్చిందే కేసీఆర్..
హైదరాబాద్ లో ఐటీ కి పునాది వేసింది కాంగ్రెస్
హైదరాబాద్ ను పెట్టుబడి నగరంగా తీర్చిదిద్దుతాం
గంగా నదిలా మూసీని ప్రక్షాళన చేస్తాం
మూసీ రివర్ ఫ్రంట్ ను అద్భుతంగా అభివృద్ధి చేసే ప్రణాళిక మా దగ్గర ఉంది
అర్బన్, రూరల్ హైదరాబాద్ కు కనెక్టివిటీ ఇవ్వనున్నాం
రాచకొండ గుట్టలను తెలంగాణ ఊటీలా అభివృద్ధి చేస్తాం
హైదరాబాద్ ను ప్రపంచానికే తలమానికంగా మారుస్తాం
కమ్యూనిస్టులతో పొత్తుల అంశం ఇంకా ముగియలేదు
పొత్తు అంశంపై మా సమన్వయ కమిటీ చర్చలు జరుపుతోంది..
ధరణి పోర్టల్ పేరుతో ప్రభుత్వమే పెద్ద దళారీగా మారింది.
ధరణిలో అత్యంత పెద్ద దళారులు కేసీఆర్ కిటుంబ సభ్యులే..
మేం ధరణిని రద్దు చేస్తామంటే కేసీఆర్ కు ఎందుకంత దుఃఖం?
నేను కందిపప్పు లాంటివాన్ని.. ఆరోగ్యానికి మంచిది.కానీ కేటీఆర్ గన్నేరు పప్పు లాంటివారు.. తింటే చస్తారు. ఆరోగ్యం బాగుండాలంటే కందిపప్పు, ముద్దపప్పును తీసుకోండి.. గన్నేరు పప్పును కాదు
2018లో తెలంగాణ సెంటిమెంటును నిద్రలేపి కేసీఆర్ రాజకీయంగా లాభం పొందారు.
2018లో చంద్రబాబు రూపంలో కేసీఆర్ కు అవకాశం దొరికింది.
కానీ పదేళ్లలో కేసీఆర్ గుడ్ విల్ సున్నా…
కాంగ్రెస్ కు ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలు భావిస్తున్నారు
బీఆరెస్ కూటమి, కాంగ్రెస్ కూటమి మధ్యే ఈ ఎన్నికలు
బీజేపీ, ఎంఐఎం బీఆరెస్ కూటమి
వందశాతం ప్రజలు ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఓడించి తీరతారు.. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం