
కాళేశ్వరంపై నేషనల్ సేఫ్టీ డ్యామ్ అథారిటీ రూపొందించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన కేంద్రం
రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ కు నివేదిక పంపిన కేంద్ర జల సంఘం
మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే
ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ, కంట్రోల్, ఆపరేషన్ మెయింటెనెన్స్ అంశాల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది
ప్లానింగ్ ప్రకారం డిజైన్ జరగలేదు…. రూపొందించిన డిజైన్ ప్రకారం కూడా నిర్మాణం జరగనేలేదు
డ్యామ్ నిర్వాహకులు సిమెంట్ కాంక్రీట్ దిమ్మెలను, నిర్మాణాలను సరిగా పరిశీలించనేలేదు
డ్యామ్ నిర్వాహకుల నిర్లక్ష్యంవల్లే మేడిగడ్డ బ్యారేజీ క్రమంగా బలహీనపడింది
బ్యారేజీ నిర్మాణాలను తనిఖీ చేయాలంటూ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినా పెడచెవిన పెట్టింది
డ్యామ్ సేఫ్టీ యాక్ట్(2021) నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించారు. ఇది ఘోర తప్పిదం
రాష్ట్ర ప్రభుత్వ తప్పిదంవల్ల ప్రజల జీవితాలకు, ఆర్దిక వ్యవస్థకు తీవ్రమైన ప్రమాదం కలిగే అవకాశం ఏర్పడింది
మేడిగడ్డ బ్యారేజీలోని ఒక బ్లాక్ లో తలెత్తిన సమస్యవల్ల మొత్తం బ్యారేజీ సక్రమంగా పనిచేయని దుస్థితి నెలకొంది. ఈ సమస్య పరిష్కారమయ్యే వరకు మొత్తం బ్యారేజీని ఉపయోగించడానికి అవకాశమే లేదు.
బ్యారేజీలోని బ్లాక్ నెంబర్ 7లో నెలకొన్న సమస్య మరమ్మతు చేయడానికి వీలు లేకుండా పోయింది. ఆ బ్లాక్ మొత్తాన్ని పునాదుల నుండి తొలగించి మళ్లీ పునర్ నిర్మించాల్సిందే.
ఈ నిర్మాణాన్ని పరిశీలిస్తే… మేడిగడ్డ బ్యారేజీలోని ఇతర బ్లాక్ లు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. మొత్తం బ్యారేజీనే పునర్ నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితి తీవ్రం కాకముందే బ్యారేజీని పునరుద్దరించాలి.
అంతవరకు రిజర్వాయర్ లో నీటిని నింపకూడదు. పెడచెవిన పెట్టి నీటిని నింపితే పైపింగ్ సమస్య ఏర్పడి ప్రజలకు నీటిని సరఫరా చేయలేని దుస్థితి ఏర్పడుతుంది.
కాళేశ్వరంలో ప్రాజెక్టులోని అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు సైతం బలహీనంగా ఉన్నాయి. ఈ బ్యారేజీల్లో సైతం మేడిగడ్డ తరహాలో సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం నెలకొంది.
అన్నారం బ్యారేజీ దిగువన బాయిలింగ్ సమస్య సంకేతాలు కన్పిస్తున్నాయి.
తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని మేడిగడ్డ బ్యారేజీతోపాటే యుద్ద ప్రాతిపదికన అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను తనిఖీలు చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలి.