
కేసీఆర్ కుటుంబంఆర్థిక ఉగ్రవాద కుటుంబమనీ, ఈ కుటుంబాన్ని శిక్షించడానికి కేంద్రం ముందుకు రావాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు..
కేసీఆర్ అవినీతికి కాళేశ్వరం బలి అయింది.కేసీఆర్ ప్రభుత్వాన్ని కాపడడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుంది.కాళేశ్వరంపై జాతీయ స్థాయిలో ఒక కమిటీ వేయాలి. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. ఆ కమిటీలో కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉండకూడదు. ప్రధాని తెలంగాణకి వచ్చినప్పుడు కాళేశ్వరం సందర్శనకు వెళ్లి జరిగిన డ్యామేజ్ పై చర్యలు తీసుకోవాలి. బండి సంజయ్ ని అధ్యక్షుడిగా తొలగించిన తర్వాత ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదు. అవినీతి వాసననే పడని మోదీ ఈ కంపుని ఎలా భరిస్తున్నాడు. మోదీకి కంపు కొట్టకుండా కేసీఆర్ ఏదైనా సెంటు కొట్టి వశీకరణ చేస్తున్నాడా?
బీజేపీ అధికారంలోకి రాదు. విచారణ చేయదు. మేం మేం ఒకటే అని కేసీఆర్, మోదీ చెప్పదలచుకున్నారా? కాంగ్రెస్ మొదలు పెట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చాడు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఆలోచనలు మారాయి. ఆశలు పెరిగాయి. ప్రాజెక్టుల రీ డిజైనింగ్ ఆమె పదం కనిపెట్టారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజుల ప్లానింగ్ వేరు, నిర్మాణం వేరు కాబట్టే మునిగిపోతున్నాయి. కేసీఆర్ దనదహానికి మెడిగడ్డ కుంగింది. కేసీఆర్ పాపం పండింది. కాళేశ్వరం కోసం తన మెదడును ఖర్చు చేశానని చెప్పిన కేసీఆర్ లోపాలు బయట పడగానే తప్పించుకుంటున్నాడు. నిర్మాణం నాణ్యత లేకపోవడం వల్లే సమస్యలు వస్తున్నాయి
తప్పు చేసిన వాళ్లపై క్రిమినల్ కేసులు పెట్టాలి. ప్రాజెక్టుల్లో ఇన్ని లోపాలు బయటపడుతుంటే కేసీఆర్ ఇప్పటిదాక ఎందుకు నోరు తెరవలేదు. నేషనల్ డ్యాం సేఫ్టీ అధారిటీ అడిగే ప్రశ్నలకు సమాచారం ఇవ్వడం లేదు. ఈ అంశంపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఇన్ని రోజులు కాళేశ్వరం అవినీతిపై ప్రశ్నిస్తే కేసీఆర్ గొప్పతనం ఒప్పుకోలేక ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఎల్ అండ్ టీ కంపెనీపై చర్యలు తీసుకోవడానికి కేసీఆర్ ఎందుకు వెనకాడుతున్నారు. 80 వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి ఎలా అయిందని కేటీఆర్ మాట్లాడుతున్నారు. పార్లమెంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డికి సమాధానం ఇస్తూ 86 వేల కోట్ల అంచనా అని 2021లో చెప్పారు. తర్వాత ప్రాజెక్టు కోసం ప్రతి అంచనాలను పెంచారు. కమీషన్లు దొబ్బడానికి కేసీఆర్ ప్రణాళిక బద్దంగా ప్లాన్ వేసాడు