
50 ఏళ్ళ నా అనుభవం లో విద్యార్ధి,యూత్ కాంగ్రెస్ ,పీసీసీ అధ్యక్షులుగా ,కేంద్ర ,రాష్ట్ర మంత్రి గా అనుభవం తో నా జీవిత చరిత్ర పై పుస్తకం రాస్తున్న..హనుమంతుడు అందరి వాడే పేరుతొ పుస్తకం విడుదల చేస్తున్న..వచ్చే తరం వారికి తెలియాలని బుక్ రాస్తున్న..నాకు ముఖ్యమంత్రి అవకాశం వచ్చింది, .పోయింది.. నాతో కేసీఆర్ , చంద్రబాబు పని చేసారని అనుభవాలు వచ్చే తరానికి తెలియాలి. సంజయ్ గాంధీ ఆలోచనతో ఓల్డ్ సిటీ లో 50 రోజులు తిరిగాను.. రాజీవ్ గాంధీ నన్ను పీసీసీ అధ్యక్షుడు ని చేశారు..
నేను సహాయం చేసిన వారి పై కూడా పుస్తకం లో రాసాను.. రాజకీయంగా ఎదుగుదల.. నష్టం కూడా ఆ బుక్ లో రాసా..7 వ తేదీన ఇందిరపార్క్ దగ్గర వెంకటరామిరెడ్డి హల్ లో పుస్తక ఆవిష్కరణ ఉంటుంది..దీనికి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చౌహన్ ,కర్ణాటక మంత్రి బొసురాజు, దీపాదాస్ మున్షి ఈ కార్యక్రమానికి హాజరవుతారు..
నాయకుల వెంట తిరిగితే పదవులు రావు… గ్రామాల్లో తిరగండి కష్టపడండి..పార్టీలు మారకుండా ఉన్న పార్టీలోనే ఎదగాలి..ఉన్నా పార్టీలోనే చచ్చేవరకు ఉండాలి..కేసీఆర్ కు సెక్రటరీయట్ , అంబేద్కర్ విగ్రహం సింబాలిక్ గా ఉంది..రైతు ఆత్మహత్యలు ,ముగ్గురు అమ్మాయిల పై అత్యాచారం జరిగితే అక్కడ పోరాడాను..ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ హన్మంతరావు ఉంటారు…