
డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం దరఖాస్తుల వెల్లువ
‘ప్రజావాణి’ లో 509 అర్జీలు దాఖలు
ఓపికతో దరఖాస్తులపై ఎండార్స్ చేసిన చిన్నారెడ్డి
ముఖ్యమంత్రి ” ప్రజావాణి ” కార్యక్రమానికి జన ప్రవాహం పెరిగింది. శుక్రవారం జరిగిన ‘ ప్రజావాణి ‘ కార్యక్రమంలో డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. శుక్రవారం నాటి ప్రజావాణి లో మొత్తం 509 అర్జీలు దాఖలు అయ్యాయి.
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్, సీఎం ప్రజావాణి ఇంచార్జీ డాక్టర్ జీ చిన్నారెడ్డి ఎంతో ఓపికతో ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా చదివి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. అవసరం మేరకు ఆయా శాఖల అధికారులకు ఫోన్ చేసి మాట్లాడి అర్జీధారుల సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకున్నారు.
ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ కూడా అర్జేదారుల సమస్యలు విన్నారు.

మొత్తం 509 ఆర్జీలలో మైనారిటీ సంక్షేమ శాఖకు సంబంధించి 200 అర్జీలు అందాయి. అందులో అధిక భాగం డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం అర్జీలు దాఖలు అయ్యాయి. రెవెన్యూ శాఖకు చెందిన 76 అర్జీలు, ఎనర్జీ శాఖకు 57 అర్జీలు, పంచాయతీ రాజ్ , గ్రామీణ అభివృద్ధి శాఖకు 35 అర్జీలు, ప్రవాసి ప్రజావాణి కార్యక్రమానికి ఐదు దరఖాస్తులు , ఇతర శాఖలకు సంబంధించి 136 దరఖాస్తులు ప్రజావాణి కార్యక్రమంలో అందాయి.