
ఉద్యోగులకు దీపావళి కానుకగా ఒక డీఏ ఇవ్వడం జరుగుతుంది.. 230 కోట్ల భారం పడుతున్న ఒక డిఏ కు క్యాబినెట్ ఆమోదించింది.2022 నుండి డిఏ లు పెండింగ్ లో ఉన్నాయి.. ప్రతిపక్షాలు డీఏల విషయంలో రాజకీయాలు చేయద్దు..
జీవో 18 ద్వారా గతంలో 17 ఫిబ్రవరి నాడు శాసన సభ లో తీసుకున్న తీర్మానం మేరకు ప్రభుత్వం సమగ్ర కుల గణన సర్వే కి సంబంధించిన విధివిధానాలను క్యాబినెట్ ఆమోదించింది..
నవంబర్ 30 లోపు సర్వే ప్రక్రియ పూర్తి చేయాలనీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది..దీనికి సంబంధించి సోమవారం కలెక్టర్ లతో కాన్ఫరెన్స్ జిల్లా , మండల అధికారులకు శిక్షణ ఇవ్వడం 150 ఇళ్లకు ఒక గ్రూప్ చేయడం జరిగింది..
ఇప్పటికే జిల్లాలో 50 ఇళ్లకు చొప్పున సర్వే జరిగింది.. ఒక్కో ఇళ్లు కు ఎంత సమయం పడుతుందని వివరాలు సేకరించడం జరిగింది..
20 రోజుల్లోపు కంప్లీట్ చేయవచ్చని నిర్ధారణకు వచ్చాం..గత ప్రభుత్వం సర్వే లు చేసి దాని నివేదిక బయటపెట్టలేదు..మా నాయకుడు రాహుల్ గాంధీ సమగ్ర కుల గణన సర్వే పై దేశ వ్యాప్తంగా కట్టుబడి ఉన్నామని చెప్పారు..నివేదికను పబ్లిక్ డొమైన్ లో ఉంచుతాం..
జనం సరైన సమాచారం ఇచ్చే విధంగా సహకరించాలి.. చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న సంఘాలు ఈ ప్రక్రియకు సహకరించాలి..