
*ఐదు గంటల పాటు క్యాబినెట్ సమావేశం జరిగింది…
* అనేక అంశాలపై కూలంకుశంగా చర్చించాం…
దీపావళి కానుకగా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం… ప్రతీ గ్రామంలో కుల, మత, పార్టీలకు అతీతంగా పక్షపాతం లేకుండా పారదర్శకంగా గ్రామ సభలు పెట్టి ఇస్తాం…దీపావళి రోజు అమావాస్య కాబట్టి నవంబర్ 1 లేదా 2న ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం…గతంలో లాగా మా పార్టీ, మా అనేది కాకుండా అర్హులైన పేద వాళ్లకు ఇండ్లు ఇస్తాం….
*ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పెండింగులో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఎలలో ఒక డీఏ వెంటనే ఇస్తాం
*317, 46 జీవోలు గత ప్రభుత్వం తీసుకొచ్చింది… దానివల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నరు…
*317జీవోలో స్పౌజ్ కేసులు , హెల్త్ సమస్యలున్న వారు , మ్యూచువల్ ట్రాన్స్ ఫర్స్ వెంటనే చేయాలని క్యాబినెట్ నిర్ణయం*
*317, 46జీవోలపై అసెంబ్లీలో చర్చిస్తాం. క్లియరెన్స్ కోసం కేంద్రానికి పంపుతాం*
*కులాలకు సంబంధించి సమగ్ర కుల గణన నవంబర్ 30 లోపు పూర్తి చేయాలని నిర్ణయం
*రాష్ట్రంలో 6 వేల సెంటర్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అయ్యాయి.20 వేల కోట్ల విలువైన ధాన్యం మిల్లర్ల దగ్గర మిగిలి పోయింది… పక్క రాష్ట్రాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నరో అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటాం…మిల్లర్ల దగ్గర బ్యాంక్ గ్యారెంటీ తీసుకోవాలని క్యాబినెట్ నిర్ణయం…
హైదరాబాద్ మెట్రో రెండో విడత 76.4 కిలోమీటర్లు 24269 కోట్లకు డిపిఆర్ తయారు… పిపిపి విధానంలో నిర్మాణం…కొత్త మెట్రో రైలు మార్గానికి సంబంధించి కేంద్రానికి డిపిఆర్ పంపాలని క్యాబినెట్ నిర్ణయం…
కొత్త గ్రామీణ రోడ్లకు క్యాబినెట్ నిర్ణయం… ఇందుకోసం ఆయా శాఖల అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసేందుకు క్యాబినెట్ ఆమోదం…
పంచాయతీరాజ్,ఆర్ అండ్ బి శాఖల ఆధ్వర్యంలో నిర్మించనున్న ఈ రోడ్లకు 25 నుంచి 28 వేల కోట్ల రూపాయలు అవసరం…ఇది కూడా పిపిపి విధానంలో నిర్మిస్తాం…
ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం కోసం గోషామాల్ భూములు కేటాయింపుకు నిర్ణయం…
3 ప్రాంతాల్లో స్కిల్ యూనివర్సిటీలకు అనుబంధంగా ఐటీఐలు…కొత్తగా ఏర్పాటు చేసిన కోర్టులకు సిబ్బంది నియామకం చేపడతాం…
రిజర్వాయర్ లలో సిల్ట్ పేరుకు పోయింది… సిల్ట్ తొలగింపు విషయంలో కడెం ప్రాజెక్టును పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్నాం…