
*ఉదయం వార్తల్లో నిలిచిన ఫాం హౌస్ కేసు లో స్వయంకృతాపరాధం*
మొదటగా రేవ్ పార్టీ అనే సమాచారం రావడం తో దాడి నిర్వహించడం జరిగిందని తెలుస్తుంది
ఫాం హౌస్ యజమాని పేరు గాని అతడు ఎవరి బంధువని గాని పోలీసులకు తెలియదని సమాచారం.
తనిఖీ చేయగా విదేశీ మద్యం పార్టీ అని తెసిసింది.
అనుమతులను చూపించమని యజమానిని కోరగా, మద్యం మత్తులో తన పేరు రాజ్ పాకాల, నేను ఎవరో మీకు చూపిస్తాను. కేటీఆర్ నా బావ అని పోలీసులపై వీరంగం ప్రదర్శించడం తో. అవాక్కయిన పోలీసులు
ఒకింత జాగ్రత్త గా, ఎక్కడ తప్పుజరిగితే ఏం జరుగుతుందో అనే భావనతో, చాలా జాగ్రత్తగా నిశితంగా ప్రాంగణమంతా పరిశీలించారని తెలుస్తుంది.
ఒక వేళ పాకాల రాజ్ తాగిన మైకం లో వీరంగం చేసి, బంధుత్వ వివరాలు స్వయంగా చెప్పకపోతే, కేటీఆర్ బావమరిది అని తెలిసేది కాదని దాడిలో ఉన్న పోలీస్ అంటున్నారు. అలా అతను చేసి ఉండకపోతే, ఈ కేసు కూడా అన్ని కేసులలో ఒకటిగా మిగిలిపోయేదని మీడియా అంతా భావిస్తుంది.
మొదటగా మీడియా అంతా పొలిటికల్ కోణం ఉండే ఉంటుంది అని భావించాం.