
అక్కినేని నాగ చైతన్య, శోభితా ధూళిపాళ వివాహ వేడుక క్రతువు మొదలైనట్లు తెలుస్తోంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్లో వీరిద్దరికీ ఒకే చోట మంగళస్నానాలు చేయించారు.
దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. డిసెంబర్ 4న రాత్రి 8.13 గంటలకు జరిగే వివాహం కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రత్యేక సెట్ ఏర్పాటు చేశారు.
బ్రాహ్మణ సంప్రదాయంలో దాదాపు 8 గంటల పాటు వీరి వివాహం జరగనున్నట్లు సినీవర్గాల సమాచారం.

