
ఇక అసెంబ్లీలో ప్రవేశపెట్టడమే ఆలస్యం
ఆర్టీసీ ముసాయిదా బిల్లుకు గవర్నర్ ఎట్టకేలకు ఆమోదం తెలిపారు. ఆదివారం ఆర్టీసీ ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం గవర్నర్ తమిళసై గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిన్న కార్మిక సంఘాలతో వర్చువల్ మీటింగ్ జరిపిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ కార్మికుల కోరిక మేరకు గవర్నర్ బిల్లుకు తొందరగానే ఓకే చెప్పారు. అయితే ఆమె తొలుత పలు అంశాలపై ప్రభుత్వం నుంచి వివరణలు కోరిన సంగతి తెలిసిందే. సీఎస్ శాంతి కుమారి కూడా వాటిని నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. మూడు రోజుల సస్పెన్స్ అనంతరం ఈ అంశానికి తెరపడినట్లు భావించవచ్చు. ప్రభుత్వం ఆదివారం రోజే బిల్లును సభలో ప్రవేశపెట్టే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ నుంచి ఆమోద ముద్ర లభించినట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వస్తుందోనని కార్మికులు అతృతగా ఎదురుచూస్తున్నారు.