
ఇకపై ప్రతి ఏటా : మంత్రి హరీష్ రావు
సిద్ధిపేటలో ఆదివారం ఉదయం హాఫ్ మారథన్ జరిగింది. సిద్ధిపేట డిగ్రీ కాలేజీలో ప్రారంభమైన ఈవెంట్‌ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. సిద్ధిపేట టౌన్లో మొదటిసారిగా నిర్వహిస్తున్న మారథన్కి ఇంత పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తుందని తాను ఊహించలేదని హరీష్ రావు ఈ సందర్భంగా అన్నారు. ఇకపై ప్రతి ఏటా సిద్ధిపేటలో ఈ ఈవెంట్‌ని నిర్వహిస్తామని ఆయన తెలిపారు. మూడు ఫార్మాట్లలో దాదాపు 25 కిలోమేటర్ల మేర సాగిన ఈ మారథాన్‌లో దాదాపుగా నాలుగు వేల మంది పాల్గొనడంతో తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. మారథాన్‌లో నిర్మల్‌కు చెందిన డాక్టర్లు కె.రఘునందన్ రెడ్డి, కె.మధుసూధన్ రెడ్డిలు పాల్గొని విజయవంతంగా ముగించారు.