
గద్దర్ మృతిపై డాక్టర్లు ప్రకటన చేశారు. అమీర్‌పేటలోని అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో ఆయన గుండె వ్యాధితో ఇబ్బంది పడుతూ చికిత్స కోసం చేరారని డాక్టర్లు తెలిపారు. జులై 20వ తేదీన అడ్మిట్ అయిన ఆయనకు ఆగస్టు 3న బైపాస్ సర్జరీ చేశామన్నారు. ఈ సర్జరీ సక్సెస్ అయినప్పటికీ వయసు కారణంగా ఊపిరితిత్తుల సమస్య రావడంతో గద్దర్ మరణించారని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. మూత్ర సంబంధిత సమస్యలు కూడా తలెత్తాయన్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కన్నుమూశారని ప్రకటించారు.