Fresh beer filling the glass directly from the tap. With extra foam spilling over glass.
చిత్రహింసలు పెట్టి మూత్రం తాగించిన అమ్మాయి ఫ్యామిలీ
సాహసము శాయరా ఢింభకా రాజ కుమారి లభించునురా! అని ఏ నేపాళ మాంత్రికుడు ధైర్యం చెప్పాడో కానీ ఓ యువకుడు పెద్ద సాహసమే చేశాడు. తాను ప్రేమించే ఊరుకు వెళ్లాడు. కాకపోతే ప్రియురాలికి బదులు ఆమె కుటుంబం కంటపడ్డాడు. అంతే వారు అతడిని పట్టుకుని గదిలో బంధించి నానా రకాల హింసలు పెట్టారు. కొట్టడంతో పాటు బలవంతంగా మూత్రం కూడా తాగించారు. అంతేనా.. దీన్నంతా వీడియో తీసి ఆ యువకుడి ఫ్యామిలీకి పంపారు. ఈ ఘటన రాజస్తాన్‌లోని ఝులావార్ జిల్లాలో జరిగింది.
పులోరో గ్రామానికి చెందిన ఓ యువతి, మధ్యప్రదేశ్ భోపాల్‌లోని కోలార్‌కు చెందిన 18 ఏళ్ల సోను మధ్య ప్రేమ పుట్టింది. 15 రోజుల కిందట ఆ అమ్మాయి ఇంటి నుంచి వెళ్లిపోయింది. భోపాల్‌కు వెళ్లి తన లవర్‌ను కలుసుకుంది. అతడితో కొన్ని రోజులు గడిపింది. ఆ తర్వాత ఆ అమ్మాయి కుటుంబం ఫోర్స్ చేయడంతో తిరిగి రాజస్తాన్‌కు వెళ్లిపోయింది. కొన్ని రోజుల తర్వాత సోనుకు ఫోన్ చేసి తన దగ్గరకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేసింది. దాంతో ప్రియురాలిని కలుసుకోవడానికి పులోరో గ్రామానికి వెళ్లాడు. వెళ్లగానే ఆ అమ్మాయి కుటుంబం అతడిని పట్టుకుంది. ఓ గదిలో పెట్టింది. దారుణంగా కొట్టింది. బీరు బాటిల్లో నింపిన మూత్రాన్ని బలవంతంగా తాగించింది. ఈ చిత్రహింసలను వీడియో తీసి సోను కుటుంబానికి పంపింది. ఈ వీడియోను చూసి సోను కుటుంబం షాక్ అయ్యింది. వెంటనే కోలార్ పోలీసు స్టేషన్లో కంప్లయింట్ చేసింది. పోలీసులు తక్షణం స్పందించి రాజస్థాన్‌కు వెళ్లారు. ఆ స్టేట్ పోలీసుల సాయంతో సోనును రక్షించారు. అమ్మాయి కుటుంబసభ్యులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.