
ప్రజాగళం గద్దర్‌ను ఆఖరు చూపుచూసేందుకు అభిమానులు పోటెత్తుతున్నారు. ఎల్బీ స్టేడియంలో ఆయన పార్థివ దేహానికి వందలాదిగా జనం వచ్చి నివాళులు అర్పిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కన్నుమూసిన ప్రజా యుద్ధ నౌక గద్దర్‌ను సాయంత్రం ఎల్బీ స్టేడియంకు తీసుకువచ్చారు. అప్పటి నుంచి ప్రముఖులు, అభిమానులు అక్కడికే వెళ్లి ఆయనకు నివాళ్లు అర్పిస్తున్నారు. మధ్యాహ్నం వరకు స్టేడియంలోనే ఆయన దేహాన్ని ఉంచి తర్వాత అల్వాల్‌లోని వెంకటాపూర్‌లోని ఆయన ఇంటికి తరలిస్తారు. అక్కడి నుంచి మహాబోధి స్కూల్ ఆవరణలో అధికార లాంఛనాలతో గద్దర్‌కు అంతిమ సంస్కారాలు జరుగుతాయి.