
గద్దర్ అన్న మరణంతో ఒక పెద్ద దిక్కును కోల్పోయామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. సోమవారం ఉదయం ఆయనకు నివాళులు అర్పించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. దళితులు, పీడిత వర్గాల కోసం ఆయన ఎంతో పోరాటం చేశారన్నారు. పీడిత వర్గాల అస్థిత్వం కోసం కృషి చేశారన్నారు. గద్దరన్న పాట ఖండోపఖండాలు దాటిందన్నారు. ఆయన పాట మూగబోయిందంటే నమ్మలేకపోతున్నామన్నారు.