
గద్దర్ చూడడానికి మాత్రమే అగ్రెసివ్‌గా కనిపించేవారు. కానీ ఆయన మనకు సున్నితం అని ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి అన్నారు. ఎల్బీ స్టేడియంలో గద్దర్‌కు నివాళి అర్పించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగు సమాజం ఒక గొప్ప కళాకారున్ని కోల్పోయిందన్నారు. తన తల్లిదండ్రుల సమాధి వద్దే తనను కూడా పెట్టాలని ఆయన చివరిసారిగా తనతో మాట్లాడిన మాటలుగా గుర్తు చేసుకున్నారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదన్నారు.