
వాళ్లిద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు. ఆ విషయమే మాట్లాడదామని ఆ అమ్మాయి ప్రియున్ని పిలిచింది. ఇద్దరు రోడ్డు పక్కన నిలబడి మాట్లాడుతుండగానే ఏం మాట పెరిగిందో ఒక్కసారిగా అమ్మాయిని అటు వైపుగా వెళ్తున్న లారీ కిందకు తోసేశాడు. దాంతో ఆమె తల చిట్లి మరణించింది. కామారెడ్డి జిల్లా నెమలిగట్టు తండాకు చెందిన ప్రమీల (23) తన పక్క తండాకు చెందిన తిరుపతి నాయక్ (27)తో ప్రేమలో పడింది. ఇద్దరు హైదరాబాద్‌లో వివిధ వృత్తుల్లో ఉన్నారు. ప్రమీల ఓ షోరూంలో సేల్స్‌గర్ల్‌గా పని చేస్తుంటే, తిరుపతి కార్ డ్రైవర్ వృత్తిలో ఉన్నాడు. పెళ్లి విషయం మాట్లాడుదామని ప్రమీల ఆదివారం తిరుపతిని పిలిచింది. బాచుపల్లి ప్రాంతంలో రోడ్డుపైనే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ లోపున ఇద్దరి మధ్య ఏదో విషయం గొడవ జరిగి తిరుపతి ఆవేశంలో ప్రమీలను లారీ కిందకు తోసేశాడు. ప్రమీల అక్కడికక్కడే మృతి చెందింది.