
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పొనుగోడు గ్రామ ప్రభుత్వ పాఠశాలలో టీచర్ల కొరతతో విద్యార్థులు రోడ్డెక్కారు. ఉపాధ్యాయులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థుల ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే టీచర్లను భర్తీ చేయాలని కోరుతూ గూడూరు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై విద్యార్థుల రాస్తారోకో చేపట్టారు. దాంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది, దింతో మండల ఎంఈఓ శ్రీదేవి అక్కడికి చేరుకొని పాఠశాలకు సమస్యలు లేకుండా చూస్తానని విద్యార్థులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.