
పాలను కల్తీ చేస్తూ విక్రయిస్తున్న వ్యక్తిని శుక్రవారం భువనగిరి ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపురం గ్రామానికి చెందిన కండ్లకట్ట మల్లారెడ్డి తన ఇంట్లో కల్తి పాలు తయారు చేస్తున్నారని సమాచారంతో ఉదయం ఎస్ఓటి పోలీసులు దాడి చేశారు. మల్లారెడ్డి ఇంట్లో 60 లీటర్ల కల్తీ పాలు, 500 ML హైడ్రోజన్ పెరాక్సైడ్, 4 ప్యాకెట్లు(1కేజీ) దొల్పూర్ స్కిమ్డు పౌడర్ స్వాధీనం చేసుకొని కల్తీ పాలను టెస్టు నిమిత్తం ల్యాబ్ పంపించినట్లు పోలీసులు తెలిపారు.