
మేఘాలయ సీఎం కాన్రాడ్ సగ్మా ఆఫీసుపై రాళ్ల దాడి జరిగింది. గారోహిల్స్లోని తురా పట్టణాన్ని
శీతాకాల రాజధానిగా ప్రకటించాలనే డిమాండ్‌తో నిరసనకారులు ఈ దాడికి పాల్పడ్డారు. రాళ్ల దాడిలో ఐదుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. మేఘాలయ ప్రస్తుత రాజధాని షిల్లాంగ్. తురాను శీతాకాల రాజధాని చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. దీనికి అనేక ప్రజా సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. దాంతో సంఘటన తీవ్రంగానే ఉంది. దాడి సమయంలో సీఎం సంగ్మా తన ఆఫీసులోనే ఉండడం గమనార్హం. నిరసనకారులు ఆయన కార్యాలయాన్ని చుట్టుముట్టడంతోపాటు పరిసరాల్లోని అన్ని రోడ్లను దిగ్బంధనం చేశారు