
వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో సర్వే నిలిపి వేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆలయాన్ని కూలగొట్టి మసీదును నిర్మించారనే వివాదం చాలా కాలంగా నడుస్తోంది. ఈ విషయం నిర్ధారించేందుకు భారత పురవస్తు శాఖ విభాగం అధికారులు సర్వే చేపట్టారు. ఇందులో భాగంగా కొన్ని తవ్వకాలు కూడా జరప తలపెట్టారు. దీనికి సుప్రీం కోర్టు బ్రేక్ వేసింది. మసీదు పరిస్థితిపై సర్వే చేపట్టాలని వారణాసి కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు పురవస్తు శాఖ సర్వే చేపట్టింది. ఈ నిర్ణయంపై అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటి సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. దీన్ని పరిశీలించిన కోర్టు జ్ఞానవాపిలో యధాతథ పరిస్థితిని కొనసాగించాలని ఆదేశించింది.