
పనిచేస్తూ చదువుకోవచ్చు.. ఓయూలో అవకాశం
ఇంజనీరింగ్ డిప్లొమా ఉన్న వర్కింగ్ ప్రొఫెషనల్స్ తమ ఉద్యోగాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం లేకుండా బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ డిగ్రీని పొందవచ్చు. ఇప్పటి వరకు ఇంజనీరింగ్ పీజీ కోర్సులు, లా డిప్లొమా కోర్సుల్లో వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు మాత్రమే అడ్మీషన్లు కల్పిస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ ఈ యేడాది నుంచి వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంజనీరింగ్, మెషిన్ లెర్నింగ్ , సివిల్ ,మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులలో అడ్మీషన్లు కల్పించనుంది. ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సుల్లో అటు జాబ్ చేస్తూ చదువుకునేందుకు అవకాశాన్నికల్పిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) అనుమతి పొందిన వర్సిటీ ఈ విద్యా సంవత్సరం నుంచి కోర్సును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీనిపై త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఓయూ అధికారులు సన్నాహాలుచేస్తున్నారు.
ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనుమతి…
ప్రస్తుతం తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా పాలిటెక్నిక్ డిప్లొమా,బీఎస్సీ మ్యాథమెటిక్స్ డిగ్రీ హోల్డర్స్ కోసం ఇంజనీరింగ్ కళాశాలలు బీఈ, బీ.టెక్ కోర్సుల్లో ద్వితీయ సంవత్సరంలో అడ్మీషన్లు కల్పిస్తున్నారు. కానీ ఇవి రెగ్యులర్ కోర్సులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు ఈ కోర్సుల్లో చేరే అవకాశం లేదు. అయితే డిప్లోమా పూర్తి చేసి బీ.ఈ , బీ.టెక్కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు సంబందిత అర్హత పరీక్షలో మంచి ర్యాంకులు సాధించినా ట్యూషన్ ఫీజులు కట్టలేక ఇంజనీరింగ్ పూర్తి చేయలేకపోతున్నారు.అయితే ఉద్యోగం చేస్తూ డిగ్రీని సంపాదించడానికి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు సహాయం చేయడంతో పాటు, వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు వారి ఉన్నత విద్యను కొనసాగించడానికి ఓయూ ఇంజనీరింగ్ కాలేజీ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్‌కు దరఖాస్తు చేసింది.దీనిపై పూర్తిగా అధ్యయనంచేసిన ఏఐసీటీఈ ఈ కోర్సును నిర్వహించేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులుజారీ చేసింది.
ప్రతి కోర్సులో 30సీట్లు….
వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ఓయూ నిర్వహిస్తున్న నాలుగు కోర్సుల్లో ప్రతి కోర్సులో 30 మంది విద్యార్థులకు అడ్మీషన్లు కల్పించనున్నారు.యూనివర్సిటీ నిర్వహించనున్న ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్, మెషిన్ లెర్నింగ్ కోర్సుల్లో చేరేందుకు ఏదైనా డిప్లోమా కోర్సు చదివి ఉండాలి. అలాగే , సివిల్ ,మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధిత సివిల్,మెకానికల్ డిప్లోమా పూర్తి చేసిఉండాలి. కోర్సుల్లో చేరాలనుకునే వర్కింగ్ ప్రొఫెషనల్స్ వారు జాబ్ చేస్తున్న సంస్థ నుంచి నోఆబ్జెక్షన్ సర్టిఫికేట్‌ను అందజేయాల్సి ఉంటుంది.యూనివర్సిటీ నిర్వహించే ప్రత్యేక ఎంట్రెన్స్ టెస్టులో సాధించిన ర్యాంకు ఆధారంగా అడ్మీషన్ దొరుకుతుంది. ఈ కోర్సులకు ఫీజులుకూడా రెగులర్ కోర్సుల ఫీజుల కంటే కొంచెం ఎక్కువగానే ఉండవచ్చని అధికారులువెలడించారు. అడ్మీషన్ పొందిన విద్యార్థులకు ప్రతి రోజుసాయంత్రం పూట గానీ, వీకెండ్స్‌లో గానీ క్లాసులు జరుగుతాయని అధికారులు వెల్లడించారు.