
గ్రూప్ 2 రీ షెడ్యూల్ తేదీలను టీఎస్పీఎస్పీ ప్రకటించింది. నవంబర్ 2, 3 తేదీల్లో పరీక్షలు జరుగుతాయని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. రెండు సెషన్లలో గ్రూప్2 పరీక్ష జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, మధ్యాహ్నం 2: 30న నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మరో సేషన్లో పరీక్ష జరగనుంది. పరీక్షకు వారం రోజుల ముందు హాల్ టికెట్స్ టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.