త్వరలో జరగబోయే బస్సు యాత్ర జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి నుండి ప్రారంభం కాబోతుందని, ఇందులో చంద్రబాబు నాయుడు పాల్గొంటారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ వెల్లడించారు. ఈ విరాలు ఇలా ఉన్నాయి.
టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగే బస్సు యాత్రలో పాల్గొంటారు.
మొదట గ్రేటర్ హైదరాబాద్ 24 నియోజక వర్గాల్లో టీడీపీ బస్సు యాత్ర చేస్తుంది. తర్వాత జిల్లాల్లో అన్ని నియోజక వర్గాల్లో ఉంటుంది.
రాబోవు ఎన్నికల్లో మహిళలకు, యువకులకు పెద్ద పీట వేయబోతున్నాం.
త్వరలో 30 పైగా అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తాం.
119 నియోజక వర్గాల్లో టిడిపి పోటీలో ఉంటుంది.
రాముడు, కృష్ణుడు,అర్జునుడు అంటే ఎన్టీయార్ అని ప్రజలు పూజించారు.
ఎన్టీయార్ ఆశీర్వాదం టీడీపీకి ఎప్పటికీ ఉంటుంది.
రేపటి నుండి నియోజక వర్గాల వారీగా మీటింగ్ లు ఉంటాయి.
బీఆర్ఎస్ నాయకులు కూడా టీడీపీకి ఓటు వేయాలని అనుకుంటున్నారు.