
రేపు జరగబోయే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కొన్ని పత్రికలు, ఛానళ్లపై కుట్రపూరితంగా తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధించడంపై బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
*ట్విట్టర్ సారాంశం*
Adolf Hitler + Joseph Goebells = KCR కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తెలంగాణలో చీకటి పాలన సాగుతోంది. దీనికి నిదర్శనమే రేపు జరుగబోయే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. నిజాలను నిర్భయంగా రాసే, ప్రసారం చేసే కొన్ని పత్రికలు, ఛానళ్లకు ప్రభుత్వం ఆహ్వానం పంపకపోవడం.
తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా #KCR ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ వార్తలు రాసి, ప్రసారం చేసే #ఆంధ్రజ్యోతి,#ABN న్యూస్ ఛానల్, #V6, #వెలుగు వంటి పత్రికలు,ఛానళ్లపై ముఖ్యమంత్రి #KCR హిట్లర్ ను మించి నియంతలా వ్యవహారిస్తున్నాడు.
ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్చను హరించడమంటే చీకటి పాలన కొనసాగించడమే.#BRS ప్రభుత్వం తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తుంది. కేసీఆర్ ను పొగుడుతూ గోబెల్స్ ప్రచారం,కట్టు కథలు, అబద్దాలను నిజాలుగా రాసే ‘గుమస్తా’ పత్రికలు,ఛానళ్ళకు మాత్రం ఎటువంటి ఆంక్షలు ఉండవు,పైగా కోట్ల రూపాయల ప్రభుత్వ అడ్వర్టైజ్మెంట్లకు కొదవ ఉండదు.
చీకటి జీవోలు తెచ్చి,చీకటి పాలన కొనసాగిస్తున్న #KCR ను వచ్చే ఎన్నికల్లో గద్దె దించాలి.అందుకోసం రేపు జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఈ నియంత పాలనను అంతం చేస్తామని శపథం చేయాలి.