
మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో నారాయణ కాలేజీలో పని చేస్తున్న వార్డెన్ ఆత్మహత్యకు పాల్పడింది. కాలేజీలోనే ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. 21 ఏళ్ల భవాని మాదాపూర్ నారాయణ కళాశాల సరస్వతి క్యాంపస్‌లో నెల క్రితమే వార్డెన్‌గా ఉద్యోగంలో చేరింది. యాదాద్రి జిల్లా పోచంపల్లి గ్రామం మెహర్‌నగర్‌కు చెందిన భవాని ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.