
రెండు పార్టీల మీటింగ్స్ తర్వాత నేతలు ప్రెస్ మీట్ పెట్టి ఇలా చెప్పారు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కునం నేని సాంబశివ రావు.
ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూసి మేధావులు వామపక్ష అభిమానులు కలత చెందారు.
మునుగోడు లాంటి ప్రత్యేక పరిస్థితుల లో brs ను గెలిపించాల్సి వచ్చింది..
సీఎం కెసీఆర్ స్వయంగా మమ్ములను పిలిచి మాకు సపోర్ట్ చేయాలని అడిగారు మేము సపోర్ట్ చేసాము.
అప్పుడు బీజేపీ దూకుడు నిరువరిoచాలని మేము brs కు సపోర్ట్ చేసాము..మేము brs కు సపోర్ట్ చేసినప్పుడు అందరూ మమ్మల్ని తిట్టారు..brs గెలిచిన తరువాత మమ్ములను మెచ్చుకున్నారు..
ఖమ్మం బహిరంగ సభ కు, ఖమ్మం లో వరదలు వచ్చినప్పుడు మమ్ములను పిలిస్తే మేము వెళ్ళాము.
మునుగోడు తరువాత కొన్ని సార్లు కమ్యూనిస్ట్ పార్టీల నేతలకు కెసీఆర్ ఫోన్ చేశారు.
మునుగోడు తరువాత సీపీఐ ,సీపీఎం నాయకుల మీద కేస్ లు పెట్టారు.
పొత్తు చెడి పోయిందని కెసీఆర్ ను బూర్జువా పార్టీల లాగా తిట్టలేము..
బీజేపీ తో కెసీఆర్ కు సఖ్యత కుదిరిందా…ఏమైంది ఇప్పుడు మమ్ములను ఎందుకు వద్దు అనుకున్నారు… కెసీఆర్ సమాధానం చెప్పాలి.
రాజకీయ ధర్మం ఉండాలి కదా…బాధ్యత ఉండాలి..మోసం ఒక్కటేనా.
ఇదే లెఫ్ట్ లేకపోతే మునుగోడు లో ఏమి జరిగేది నీకు తెలవదా.
మునుగోడు లో బీజేపీ గెలిస్తే మీ ఎమ్మేల్యేలు ఉండే వారా…అప్పటికే brs ఎమ్మెల్యే లను బీజేపీ కొనుగోలు చేయలేదా..
నీ కర్మ నీతో మాకు వచ్చేది ఏమి లేదు..
బీజేపీ అండ దండలు ఉండాలని నువ్వు అనుకుంటున్నావు…బీజేపీ అండ ఉంటే చాలు అనుకుంటున్నావు కదా చూద్దాము..
మేము గెలవడానికి మా మేము ప్రయత్నo చేస్తాము.
సిపిఐ, సిపిఎం గా కలిసి ఉంటాము..మాతో కలిసి వచ్చే పార్టీలను కలుపుకుని పని చేస్తాము..వ్యక్తులు శక్తులు గా మాతో కలవాలని కొంత మంది చూస్తున్నారు.
తమ్మినేని వీరభద్రం, సిపిఎం
కొంత కాలం గా లెఫ్ట్, బిఆరేస్ కలిసి పోటీ అని ప్రచారం ఉంది
బీజేపీ ని ఓడించటం కోసం బిఅరెస్ తో కలిసాము
బీజేపీ కి వ్యతిరేకంగా పనిచేసే పార్టీ లు ఏకంగా ఉండాలి అనేది మా నిర్ణయం
ఒక వేదిక ఉండాలని ఇండియా కూటమి ఏర్పడింది
మేము అడిగిన సీట్లు కేసీఆర్ ఇవ్వలేదు అని ప్రచారం తప్పు
రాజకీయ వైఖరి లొనే తేడా వచ్చిందా
చర్చలు జరిగాయి.. వినోద్ కుమార్, పల్లా రాజేశ్వర్ రెడ్డి వచ్చారు
ఈ చర్చల్లో సీట్లు పొత్తు ల గురుంచి మాట్లాడలేదు
కేసీఆర్ చెప్పిన సందేశం ను మాకు వాళ్ళు చెప్పారు
2024 లో దేశంలో బీజేపీ ని దించాలి
కాంగ్రెస్ తో విభేదాలు ఉన్నాయి అనేది నిజం
బీజేపీ ని నిలువరించాలని కాంగ్రెస్ తో కలిసాము
బీజేపీ వ్యతిరేకం ఒకే అని ..కాంగ్రెస్ తో జాతీయ స్థాయిలో కలవద్దు అని బిఅరెస్ నేతలు మాకు చెప్పారు
యూపీ ఏ కు మా మద్దతు ఉంటుంది
సీట్లు, పొత్తు పై మీటింగ్ చివరలో చర్చ జరిగింది
మేము మా అభిప్రాయం, వాళ్ళు వాళ్ళ అభిప్రాయం చెప్పారు
*ఇండియా కూటమి లో లెఫ్ట్ పార్టీ లు ఉన్ననందు వల్ల నిన్న సీట్లు ఇవ్వలేదు అని అనుమానం ఉంది
దీనికి సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలి
వచ్చే ఎన్నికల్లో 2 లెఫ్ట్ పార్టీ లు కలిసి పోటీ చేస్తాము
మా మీద విమర్శలు చేస్తున్నారు.. కేసీఆర్ గురుంచి ఇప్పడు అయిన తెలిసింద అని అంటున్నారు
కేసీఆర్ ప్రభుత్వం పై ఎక్కువ పోరాటాలు చేసింది మేమే
కేస్ లు మా మీదే ఎక్కువ ఉన్నాయి