వర్షాకాలంలో జీర్ణశక్తి ఎంతో బలహీనంగా ఉంటుంది. దీంతో తరచూ
కడుపులో గ్యాసు పోసుకోవడం, పోట్లు రావడం, పొట్ట బరువుగా
ఉండడం, అజీర్తి వంటి సమస్యల బారిన పడుతుంటాం. ఇందుక
కారణం వర్షా కాలంలో వైరస్లు, ఇన్ఫెక్షన్ల తీవ్రత ఎక్కువగా ఉండడమే.
మరి ఈ సమస్యలను అధిగమించేందుకు మార్గం ఉందంటున్నారు
ఆయుర్వేద నిపుణులు. వీటన్నింటినీ తగ్గించే ఆయుర్వేద టీ ఒకటి
ఉందంటున్నారు. ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్ అని
చెప్తున్నారు. ఈ టీ తయారుచేసుకోవాలంటే ముందుగా నేతిలో
వేగించిన పావు టీస్పూను ఇంగువ పొడి, రాళ్ల ఉప్పు పావు స్పూను,
జీలకర్ర అరటీస్పూను, 300 ఎంఎల్ నీళ్లు రెడీగా పెట్టుకోవాలి.
తర్వాత ఈ పదార్థాలన్నింటినీ నీటిలో కలిపి ఐదు నిమిషాలు సన్నని
మంటపై మరగపెట్టాలి. తర్వాత ఆ నీటిని ఒడగట్టకుండానే తాగాలి.
ఈ టీ తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగవుతుంది. గ్యాసు, కడుపులో పోట్లు
కూడా బాగా తగ్గుతాయని ఆయుర్వేదనిపుణులు చెప్తున్నారు.