
మీ గోళ్లు పింక్ రంగులో ఉండి చక్కటి షేపులో ఉన్నాయా? అయితే
అవి ఆరోగ్యంగా ఉన్నాయన్నాయని అర్థం. ఇవి ఎవరో చెబుతున్న
మాటలు కాదు. సాక్షాత్తూ వైద్యులు అంటున్న విషయం. మీ గోళ్ల
రంగు మారినా, టెక్స్చెర్ దెబ్బతిన్నట్టు కనిపించినా పోషకాల లోపంతో
మీరు బాధపడుతున్నారని అర్థంట. ఇన్ఫెక్షన్ల ఉన్నా, ఇతరత్రా ఆరోగ్య
సమస్యలు తలెత్తినా వాటి ప్రభావం సైతం గోళ్ల రూపురేఖల్లో
ప్రతిఫలిస్తుందిట. సరైన పోషకాహారం తీసుకోకపోయినా, శరీరంలో
తగినన్ని విటమిన్లు లోపించినా గోళ్లు పొడిబారి కాంతివిహీనంగా
ఉంటాయిట. గోళ్లు పగులుతాయిట. వాతావరణం మార్పు, వయసు,
గర్భవతులయినా, చేతులు, పాదసంరక్షణలకు సంబంధించిన
కారణాల వల్ల సైతం గోళ్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందిట.
రక్తహీనంతో బాధపడుతున్నా, శరీరంలో ఐరన్ లోపం ఉన్నా గోళ్ల
రంగు, రూపురేఖల్లో తేడా ప్రస్ఫుటంగా కనిపిస్తుందంటున్నారు
వైద్యులు. గోళ్లు అంచుల్లో వంగినట్టు ఉంటే ఊపిరితిత్తుల సమస్య లేదా
గుండెకు సంబంధించిన అనారోగ్య సమస్య ఉన్నటట. చేతివేళ్ల చిగుళ్ల
నుంచి గోళ్లు సీదా పెరిగినా, గోళ్ల రూపు సాధారణ రీతిలో లేకపోయినా
కూడా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య మీ శరీరంలో
ఉన్నదన్నదానికి సూచిక అట. గోళ్లు చతురస్రాకారంలో, వెడల్పుగా
ఉంటే హర్మోన్లకు సంబంధించిన సమస్యను సూచిస్తుందిట. గోళ్లు
బాగా పలచగా ఉన్నాయనుకోండి మీ శరీరంలో విటమిన్ బి12 లోపం
బాగా ఉందని తెలుపడమే. మీ గోళ్లు సరైన ఆకారంలో లేకపోతే మీరు
ఆరోగ్యకరమైన డైట్ ను తీసుకోవాల్సి ఉంటుంది. విటమిన్ బి12 బాగా
ఉన్న పదార్థాలు అంటే మాంసం, పాలఉత్పత్తులు, గుడ్లు ఎక్కువగా
తీసుకోవాలి. ఐరన్ లోపం ఉంటే ఆకుకూరలు, కూరగాయలు, నట్స్,
విటమిన్ సి ఉన్న సిట్రస్ ఫ్రూట్స్ తినాలి. గోళ్లు పగిలినట్టు
అవుతుంటాయి కొంతమందికి. ఇది శరీరంలో కెరొటిన్ లోపం వల్ల
తలెత్తుందిట. బాగా వేడి, బాగా చల్లదనం వంటి తీవ్ర వాతావరణ
పరిస్థితుల ప్రభావం సైతం గోళ్ల మీద పడి అవి తొందరగా
ఊడిపోతుంటాయి. శరీరంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లోపం వల్ల
ఈ కండిషన్ సంభవిస్తుందిట. అందుకే గోళ్లు ఊరికూరికే ఊడిపోతుంటే
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్న వాల్ నట్స్,
అవిసెగింజలు, బాదం, నట్స్, సన్ ఫ్లవర్ సీడ్స్ వంటివి బాగా తినాలి.
గోళ్లు పసుపు పచ్చరంగులో ఉంటే మధుమేహం, కాలేయ సమస్యలు,
ఊపిరి సమస్యలు వంటి జబ్బులు శరీరంలో ఉండడమేనట. గోళ్లల్లో
పసుపురంగు మచ్చలు కనిపిస్తే సొరియాసిస్, ఫంగస్ సమస్యలు
శరీరంలో ఉన్నాయన్నదానికి సూచిక అట. గోళ్లల్లో పగుళ్లు బాగా
ఉన్నా, గోళ్లు బలహీనంగా ఉన్నా అందుకు రకరకాల సమస్యలు
కారణమట. శరీరంలో మాయిశ్చరైజింగ్ లోపించడం, థైరాయిడ్
సమస్య, కాల్షియం, ప్రొటీన్ల ఇన్ టేక్ తక్కువగా ఉండడం వంటివి
ఇందుకు కారణాలని వైద్యులు చెపుతున్నారు. గోళ్లు చిట్లిపోతుంటే
చేపలు, మెంతులు, ఆకుకూరలు, కూరగాయలు వంటివి బాగా
తినాలని వైద్యులు చెబుతున్నారు..