
వరంగల్ జిల్లా తీగరాజుపల్లి గ్రామానికి చెందిన పూజ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెను చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. జూలై 18న ఇంట్లో ఉరి వేసుకున్న పూజను తొలుత స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. తర్వాత నిమ్స్‌కు తీసుకువచ్చారు. నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆమె బ్రెయిన్ డెడ్ స్థితికి వెళ్లింది. దాంతో జీవన్‌దాన్ కో ఆర్డినేటర్లు అవయవ దానం గురించి తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించారు. పూజ కిడ్నీలు, కార్నియా, లివర్, లింగ్స్ని డాక్టర్లు సేకరించారు. వీటిని అవసరం ఉన్న పేషంట్లకు అమరుస్తామని జీవన్‌దాన్ ప్రతినిధులు తెలిపారు.
