
అంగన్వాడీ కార్యకర్తలను ఉద్దేశించి సిద్దిపేటలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీష్రావు మాట్లాడుతూ కమ్యూనిస్టుల ఉచ్చులో పడొద్దటూ వ్యాఖానించడం పట్ల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. కమ్యూనిస్టు పార్టీలకు మనుషులు లేరు, కార్యకర్తలు లేరని కూడా హరీష్ రావు వ్యాఖ్యలు చేశారనీ, ఆయన గుండె మీద చెయ్యివేసుకొని ఆ మాట చెప్పగలుగుతారా అని సాంబశివరావు ప్రశ్నించారు. కమ్యూనిస్టు కార్యకర్తలు, మనుషులు లేకుంటే మునుగోడులో బీఆర్ఎస్ పార్టీ గెలువగలిగేదా అని నిలదీశారు. మునుగోడు ఎన్నికల తరువాత కమ్యూనిస్టుల మద్దతుతోనే గెలిచామని ఆ పార్టీ అధినాయకులు కృతజ్ఞతలు చెప్పిన విషయం వాస్తవం కాదా అని గుర్తు చేశారు. అంగన్వాడీ, ఆశ వర్కర్లే కాదు, రాష్ట్రంలోని, దేశంలోని ప్రతి కార్మికుడుకి అండాదండా ఎర్రజెండా అని ఆయన అన్నారు