
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావుకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ తీర్పు ఇచ్చింది. జలగం వెంకటరావును ఎమ్మెల్యేగా ప్రకటించింది. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చిరాని జలగం 2019 జనవరిలో కోర్టును ఆశ్రయించారు. సమగ్ర విచారణ తర్వాత కోర్టు వనమా ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చింది. సమీప అభ్యర్థి అయిన జలగం వెంకటరావును విజేతగా ప్రకటించింది. వనమాకు కోర్టు ఐదు లక్షల రూపాయల జరిమానా విధించడంతో పాటు ఆయన ఎన్నికను ప్రకటించిన 2018 నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా అర్హుడు కాదని తీర్పునిచ్చింది. 2018లో జరిగిన ఎన్నికల్లో జలగం టీఆర్ఎస్ (నేటి బీఆర్ఎస్) నుంచి పోటీ చేయగా, వనమా కాంగ్రెస్ తరపున బరిలో నిలిచి గెలిచారు. కాగా వనమా తర్వాత కొంత కాలానికి టీఆర్ఎస్లో చేరారు.