
మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌కు కొట్టి వేయాలని ఆయన హైకోర్టును కోరారు. కానీ కోర్టు ఆయన వేసిన పిటిషన్‌ను కొట్టి వేసింది. శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు ధృవ పత్రాలు సమర్పించారని మహబూబ్‌నగర్ ఓటర్ రాఘవేంద్ర రాజు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌కు అర్హత లేదనీ, కొట్టి వేయాలని మంత్రి కోర్టులో పిటిషన్ వేసి భంగపడ్డారు.