
‘‘మేం జనాభాలో ఐదు శాతం మాత్రమే. కానీ మాకు పది శాతం రిజర్వేషన్లు దొరుకుతున్నాయి. 20 మంది మంత్రుల్లో బీసీలు ముగ్గురే. మిగితా వన్నీ మా రెడ్డి, వెలమ దొరలవే” అని ఎమ్మెల్సీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి అన్నారు. 60 శాతం ఉన్న బీసీలకు 25 శాతం రిజర్వేషన్లు ఇచ్చి, ఐదు శాతం ఉన్న తమకు మాత్రం ప్రత్యేక రిజర్వేషన్లు ఇచ్చారన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ ఐక్య వేదిక ఓబీసీ సమావేశంలో ఆయన ఈ కామెంట్లు చేశారు. అగ్రవర్ణ పేదలకు కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ పది శాతం రిజర్వేషన్లు కల్పించిందని చెప్పారు. బీసీలు రాజ్యాధికారం కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.