

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల సమయాలను మారుస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల సమయాలు జులై 25వ తేదీ నుంచి మారనున్నాయి. ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.15 వరకు పని చేస్తాయి. ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45 వరకు నిర్వహిస్తారు.