తిరుమల : అలిపిరి కాలినడక మార్గంలో బోనులో మరో చిరుత చిక్కింది. ఏడో నంబర్ మైలు వద్ద ఆదివారం 7 గంటల ప్రాంతంలో చిరుత చిక్కినట్లు తితిదే అధికారులు వెల్లడించారు. కాగా ఈ చిరుతతో కలిపి మొత్తంగా ఇప్పటివరకు నాలుగు చిరుతలను పట్టుకున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.