
ఇటీవలి చాలామంది తరచూ ఫ్లూ జ్వరాల బారిన పడుతన్నారు. ఇలాంటి వారికి ఫ్లూను తగ్గించే మంచి టీ ఒకటి ఉంది. దీన్ని ఇంటోనే సులభంగా తయారుచేసుకోవచ్చు. ఈ టీని వేడివేడిగా తాగితే ఫ్లూ జ్వరం తగ్గి శరీరం ఎంతో ఉత్తేజితం అవుతుంది. దీని ఫలితాలు కూడా శరీరంపై చాలా బాగుంటాయంటున్నారు పోషకాహారనిపుణులు. మరి ఈ ఫ్లూ ఫైటింగ్ టీ ఎలా తయారుచేసుకోవాలి అని ఆలోచిస్తున్నారా? దీని తయారీకి కాలసిన పదార్థాలు కొన్ని ఉన్నాయి.
మూడు కప్పుల నీరు, అరచెక్క నిమ్మరసం, ఒక దాల్చినచెక్క ముక్క, తాజా అల్లం ముక్కలు మూడు (ఒక్కో ముక్క పావు అంగుళం మందం ఉండాలి), పావు టీస్పూను లవంగాలు, అర టేబుల్ స్పూన్ పసుపు, చిటికెడు కెయెన్నె, ఒకటిన్నర టేబుల్ స్పూన్ ముడి తేనెలను రెడీ పెట్టుకోవాలి. ముందే చెప్పినట్టు దీన్ని తయారుచేయడం కష్టమేమీ కాదు. పెద్దా చిన్నా ఎవరైనా సులభంగా చేసే టీ ఇది.
ఒక చిన్న కుండలాంటి పాత్ర తీసుకుని ఒక్క తేనె తప్ప మిగతా పదార్థాలన్నీ అందులో వేసి బాగా ఉడకనివ్వాలి. అది ఉడకడం మొదలవగానే సన్నని సెగపై ఆ మిశ్రమాన్ని మెల్లగా మరగనివ్వాలి. బాగా ఉడికిన ఆ మిశ్రమంలో సరిపడినంత తేనె వేసి చెంచాతో బాగా కలపాలి. ఆ టీని వడగట్టి వేడి వేడిగా తాగాలి. ఇలా చేస్తే ఫ్లూ బాధలు ఇట్టే ఎగిరిపోతాయి. మరి ఆలస్యం ఎందుకు మీరు కూడా దీన్ని మీ ఇంట్లో తయారుచేసుకుని తాగి ఫ్లూ బాధల నుంచి బయటపడొచ్చు.