
బీజేపీ తరపున పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు సోమవారం నుంచి దరఖాస్తులు పెట్టుకోవాలని పార్టీ సూచించింది. దాంతో ఒక్కసారిగా పార్టీ కార్యాలయం వద్ద హడావిడి పెరిగింది. ఈ నెల 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తులు స్వీకరించడానికి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఒక ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేశారు.
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తుల పరిశీలన కోసం రాష్ట్ర పార్టీ ఒక ఎన్నికల స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేయనుంది. ఎన్నికల బరిలో నిలవాలని చాలా మంది ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల బీజేపీ పట్ల ఆకర్శితులైన యువత, మహిళ పోటీకి ఆసక్తి చూపుతున్నారు.
దరఖాస్తు చేసుకున్న వారి పేర్లను ఎన్నికల కమిటీ పరిశీలించి ఒక్కో నియోజక వర్గం నుంచి ముగ్గురి పేర్లను జాతీయ పార్టీ పరిశీలినకు పంపుతారు. హైకమాండ్ ఒక్క పేరును ఎంపిక చేసి అభ్యర్థిగా ప్రకటిస్తారు.