
తెలంగాణ శాసన సభ, శాసన మండలి సమావేశాలు ఆగస్టు 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు ఉభయ సభలు ప్రారంభమవుతాయి. అదే రోజు జరిగే బీఏసీ సమావేశంలో పని దినాలపై నిర్ణయం తీసుకుంటారు. గత సమావేశాలకు కొనసాగింపుగా జరుగుతున్న ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికలకు సమీపంలో జరగనున్న ఈ సమావేశాలు హాట్‌హాట్‌గా ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అధికార, విపక్షాలు తమ తమ అంశాలతో సమావేశాల్లో గట్టిగా తలపడనున్నట్లు ఆయా పార్టీల ప్లాన్‌తో తెలుస్తోంది. ప్రస్తుత వర్షాలు, వరదలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని విపక్షాలు భావిస్తున్నాయి. దళిత బంధు అందరికీ అందలేదని ప్రతిపక్షాలు, అందజేసిన ప్రయోజనం గురించి అధికార పార్టీ ప్రజలకు వివరించేందుకు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాయి.