
నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలా…ఎంపీగా పోటీ చేయాలా…అనేది హైకమాండ్ నిర్ణయిస్తుంది.
ఎన్నికల్లోనే కాదు…ఆ తరువాత కూడా బీఆర్ఎస్ తో పొత్తు అసాధ్యం..
మజ్లిస్ తో అంటకాగుతున్న పార్టీతో పొత్తు ఎలా పెట్టుకుంటాం?
కుటుంబ పాలనలో ఉన్నప్పుడు దేశం అన్ని రంగాల్లో దిగజారింది…. అన్నింటా అవినీతి… జవాబుదారీతనం మచ్చుకైనా కనిపించలేదు. అంతా దాపరికం.. దళారీలు…పైరవీలు.. కోటరీ…ఇవే నడిచేవి.
ఒక్క కుటుంబం కోసమే ప్రజలు అన్నట్టు అప్పటి పాలకులు వ్యవహరించే వారు.
మోడీ దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారు. పెట్టుబడులతో రండి..దేశాభివృద్ధిలో భాగస్వాములుకండి అని బండి సంజయ్ ఎన్నారైలకు పిలుపునిచ్చారు.