
మంత్రి గంగుల కమలాకర్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్ పడింది. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని కోర్టు విచారణకు స్వీకరించింది. రిటైర్డ్ జిల్లా న్యాయమూర్తి శైలజతో ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. ఆగస్టు 12 నుంచి 17 వరకు క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 21కి వాయిదా వేసింది.