
రాష్ట్రంలోని పట్టణాలను డల్లాస్, న్యూయార్క్ నగరాలుగా తయారుచేస్తామని చెప్పి బీఆర్ఎస్ నేతలు కబ్జాలు చేస్తున్నారని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ పని చేస్తున్నారన్నారు. చెరువులు, కాలువలు, నాలాలు కబ్జాలు చేస్తున్నారన్నారు. దాంతో నీళ్లన్నీ రోడ్ల మీదకు వచ్చాయనీ, ఇండ్లు నీట మునిగి జనజీవితాన్ని ఆగం చేస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ సర్కార్ ఎప్పుడు కూడా పట్టణాభివృద్ధిని పట్టించుకోలేదన్నారు.